అధ్యక్ష ప్రమాణ స్వీకారం విందు…వంటకాలు ఏమిటంటే..
అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారానికి రానున్న అతిథులకు నోరూరించే వంటకాలను విందులో వడ్డించబోతున్నారు. ఈ విందులో ప్రత్యేకించి ఉపాధ్యక్షురాలైన కమలాహారిస్‌కు ఎంతో ఇష్టమైన గంబో వంటకం కూడా ఉండబోతోంది. ఈ విందుకు తగిన ప్రత్యేక వంటకాలన్నీ కమలాహారిస్‌తో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు చెఫ్ రాబర్డ్ డోర్సీ వండడం ప్రత్యేకంగా నిలవబోతోంది. కమలాహారిస్‌కు ప్రీతిపాత్రకమైన వంటకం.. చిక్కనైన సూప్నే గంబో అంటారు. దీన్ని పెల్ ఫిప్ లేదా మాంసం, కాప్సికం, ఉల్లిపాయలతో తయారుచేస్తారు. గంబో లూసియానా రాష్ట్ర అధికార వంటకం కావడం కూడా విశేషం.
డిన్నర్లో వంటకాలు …
ఎపిటైజర్గా.. పాంకో క్రస్టెడ్ క్రాబ్ కెక్స్, ఆర్గానిక్ కోస్టల్ గ్రీన్స్
ప్రధాన వంటకాలుగా …
గంబోతో పాటు వైట్ రైస్, లూసియానా లవ్, డీప్ అంబర్ రౌక్స్, స్వీట్ పెప్పర్స్, బ్లాక్న్డ్ చికెన్.
స్వీట్లు …
బనానా రైసిన్ బ్రెడ్ ఫుడ్డింగ్, బౌర్బోన్ కారమెల్.






