H1B Visa :హెచ్1బీ వీసాతోనే అది సాధ్యం : ట్రంప్

హెచ్1బీ వీసా (H1B visa )పై రిపబ్లికన్ పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump ) స్పందించారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk), భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తుంటే ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయని ట్రంప్ తెలిపారు. సమర్థువంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని తానూ కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశ వ్యాపారాలను విస్తరింపజేసేందుకు తమకు సమర్ధవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలని, అది హెచ్1బీ వీసాతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.