డొనాల్డ్ ట్రంప్ తో లైంగిక సంబంధాలు నిజమే.. శృంగార తార డేనియల్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ కేసులో మరో షాక్ తగిలింది. ట్రంప్ అతని హోటల్ సూట్లోని బెడ్‌పై సెక్స్‌లో పాల్గొన్నట్టు అడల్ట్ స్టార్ స్మార్మీ డేనియల్స్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ సమయంలో ట్రంప్ కండోమ్ వాడారా? అని అడిగిన ప్రశ్నకు, లేదు అని డేనియల్స్ సమాధానమిచ్చారు. ట్రంప్‌తో 2006 నాటి లైంగిక సంబంధాన్ని కోర్టుకు వివరించారు. ఈ కేసులో ట్రంప్‌పై కోర్టులో క్రిమినల్ నేరారోపణలు నమోదయ్యాయి. డేనియల్స్‌తో శారీరక సంబంధం 2016 ఎన్నికల ప్రచార సమయంలో బయటకు రాకుండా ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణల్ని ట్రంప్ ఎదుర్కొంటున్నారు.






