జో బైడెన్ కుమారుడి నేరాంగీకారం!
శిక్ష వేయకుండా క్షమించే ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తన నేరాలను అంగీకరించనున్నారు. కేంద్ర పన్నుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడటంతో పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. జైలుకు పంపబోమనే హామీతో ఆయన న్యాయశాఖతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం 55 ఏళ్ల హంటర్ మిస్డె మినోర్ పన్నుల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆయన నేరాన్ని అంగీకరిస్తారు. డ్రగ్ వినియోగదారుడిగా ఉన్న హంటర్ అక్రమ ఆయుధం కలిగి ఉన్న కేసులోనూ నేరాన్ని అంగీకరిస్తారు. దీంతో ఈ రెండు కేసుల్లో ఆయన ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోవడంతో పాటు జైలు శిక్ష నుంచి ఉపశమనం పొందుతారు.






