నేను నిర్దోషిని ..కోర్టులో బైడెన్ కుమారుడు
ఆయుధాలు కలిగి ఉన్న కేసులో తాను నిర్దోషినని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కోర్టుకు తెలిపారు. 2024లో ఎన్నికలు జరగనున్న వేళ విచారణకు వస్తుందనుకుంటున్న ఈ కేసులో హంటర్ ఈ ప్రకటన చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ త్వరలో ఆయన ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నారు. 2018లో డ్రగ్స్ వినియోగించడంపై అబద్ధం చెప్పడంతో పాటు తుపాకీని కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై 3 కేసులను హంటర్ ఎదుర్కొంటున్నారు. మరోవైపు హంటర్ విదేశీ వ్యాపార లావాదేవీల అంశంలో అధ్యక్షుడు బైడెన్ అభిశంసించేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు.






