హంటర్ బైడెన్ ను దోషిగా తేల్చిన కోర్టు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను తుపాకీ కొనుగోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. 2018లో తుపాకీ కొనుగోలు చేసిన సమయంలో డ్రగ్స్‌కు బానిస కాదంటూ ఆయుధ డీలర్ వద్ద అబద్దం చెప్పారని, ఆ తుపాకీని 11 రోజులపాటు అక్రమంగా తన వద్దే ఉంచుకున్నారని న్యాయమూర్తులు నిర్థారించారు. కేసు విచారించిన డెలావెర్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్ నొరీకా మాత్రం హంటర్‌కు 120 రోజుల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని, అక్టోబర్‌లో తీర్పు వెలువడుతుందని చెప్పారు. సాధారణంగా ఇలాంటి నేరాలకు గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలున్నాయి. హంటర్ బైడెన్‌పై మరో కేసుంది. పన్ను ఎగ్గొట్టిన ఆరోపణలపై కాలిఫోర్నియా కోర్టు సెప్టెంబర్‌లో విచారణ జరపనుంది.






