వైట్ హౌజ్ వద్ద నిరసన..
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు పాగా వేసిన నేపథ్యంలో అమెరికాలోని ఆఫ్ఘానీయలు నిరసనకు దిగారు. వందలాదిగా వైట్‌హౌస్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఆఫ్ఘానిస్థాన్కు ఈ గతి పట్టడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెనే కారణమని ఆరోపించారు. అఫ్ఘాన్ పౌరులను బైడెన్ మోసం చేశారని ఆగ్రహం వెళ్లగక్కారు. భారత్‌లోని ఆఫ్ఘానిస్థాన్ రాయబార కార్యాలయానికి చెందిన ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. దేశం వదిలి పారిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ఘాటుగా విమర్శిస్తూ ఎంబసీ అధికారిక హ్యాండిల్ నుంచి వరుస ట్వీట్లు చేసిన కాసేపటికి ఇలా జరిగింది. మరోవైపు తప్పుడు నిర్ణయాలతో ఆఫ్ఘాన్ గడ్డపై ఆశాంతికి బీజాలు వేసిన బైడెన్ వెంటనే గద్దె దిగాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.






