Donald Trump: పుతిన్ కంటే వారే ప్రమాదం : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) కంటే అక్రమ వలసదారులతోనే ముపుప ఎక్కువని పేర్కొన్నారు. మనం పుతిన్ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పని లేదు. మన దేశంలోకి ప్రవేశించే అత్యాచార ముఠాలు, డ్రగ్ మాఫియాపైనే ఎక్కువగా దృష్టి సారించాలి. అప్పుడే మనకు ఐరోపా (Europe) లాంటి పరిస్థితి ఉండదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల (Illegal immigrants )పై ఉక్కుపాదం మోపారు. తమదేశంలో ఉండటానికి సరైన పత్రాలు లేని, అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని ట్రంప్ వెనక్కి పంపుతున్నారు.