Harvard University: ట్రంప్ పరిపాలనా యంత్రాంగంపై హార్వర్డ్ దావా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పరిపాలనా యంత్రాంగంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) కోర్టులో దావా వేసింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులపై ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే కోత విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 1 బిలియన్ డాలర్ల నిధుల కోతకు అమెరికా ప్రభుత్వం (US Government) ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హార్వర్డ్ ఈ దావా వేసింది. హార్వర్డ్‌కు నిధులు నిలిపివేయడం ద్వారా విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్నారని కేసు దాఖలు చేసింది. ట్రంప్ యంత్రాంగం లక్ష్యంగా చేసుకున్న ఇతర విద్యాసంస్థల (Educational institutions) పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొంది.