కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య.. నేడే డిబేట్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రత్యక్ష సంవాదానికి రంగం సిద్ధమైంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమాన్ని అమెరికా వార్త సంస్థ ఏబీసీ న్యూస్ ఈ నెల 10న ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో ( అమెరికా కాలమాన ప్రకారం) రాత్రి 9.00 గంటలకు నిర్వహించనుంది. ప్రేక్షకులు మాత్రం ఎవ్వరూ ఉండరు. ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్లు ఈ చర్చకు సమన్వయకర్తలుగా ఉంటారు. 90 నిమిషాల పాటు చర్చ జరగనుంది. మధ్యలో రెండుసార్లు స్వల్ప విరామం ఉంటుంది. డిబేట్ చివరలో చెరో రెండు నిమిషాలు ముగింపు ప్రసంగం చేసేందుకు అనుమతిస్తారు.






