జార్జియాలో రీకౌంటింగ్ …
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు 99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిన జార్జియాలో రీకౌంటింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. బిడెన్, ట్రంప్ మధ్య ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉండటమే ఇందుకు కారణం. ఓట్ల శాతంలో తేడా 0.5గా ఉండటంతో రీకౌంటింగ్ చేయాలని నిర్ణయించారు. 99 శాతం కౌంటింగ్ పూర్తయిన జార్జియాలో బిడెన్‌కు 49.40 శాతం (2,450,117 ఓట్లు) పోలవగా, ట్రంప్‌కు 49.37 శాతం (2,448,538 ఓట్లు ) పోలయ్యాయి. జార్జియా రాష్ట్రంలో మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ స్థానంలో ప్రస్తుతం బిడెన్ 0.03 శాతం అధిక్యంలో ఉన్నారు. రీకౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించడంతో జార్జియా ఫలితం మరింత ఆలస్యం కానుంది.






