Trudeau :అమెరికాకు సాయం చేస్తాం : ట్రూడో
అమెరికాలోని లాస్ఏంజెలెస్ (Los Angeles )లో వ్యాపిస్తున్న కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్రరాజ్యానికి సాయం అందిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau ) పేర్కొన్నారు. కాలిఫోర్నియా (California) లో వ్యాపిస్తున్న మంటల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. కెనడియన్లు అక్కడ ఉన్న ప్రతిఒక్కరి గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ కార్చిచ్చులు మాకేమీ కొత్త కాదు. కాలిఫోర్నియా అనేకసార్లు మాకు సాయం చేసింది. కెనడియన్ వాటర్ బాంబర్లు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మా పొరుగుదేశమైన అమెరికాకు మరిన్ని వనరులను అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.






