డ్రీమర్లను వెనక్కి పంపకపోవడం చట్టవిరుద్ధం
సాధికార పత్రాలు లేకుండా బాల్యంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వచ్చి అక్కడే పెరిగి పెద్దయిన వలసదారులను (డ్రీమర్లు) వెనక్కి తిప్పిపంపకుండా నిరోధిస్తున్న ప్రభుత్వ విధానం (డాచా) చట్టవిరుద్ధమని ఫ్లోరిడాలోని జిల్లా కోర్టు జడ్జి ఆండ్రూ హ్యానెన్ తీర్మానించారు. అదే సమయంలో సదరు అక్రమ వలసదారులు అమెరికాలో కొనసాగడానికి పెట్టుకునే దరఖాస్తులను ప్రభుత్వం అనుమతిస్తూనే ఉండవచ్చని తెలిపారు. అమెరికాకు సాధికార అనుమతులు లేకుండా వలస వచ్చినవారు లక్షల్లో ఉంటారు. వీరిలో భారతీయుల సంఖ్య దాదాపు 6.3 లక్షలని, 2019లో దక్షిణాసియన్ల సంఘం స్టాల్ తెలిపింది. 2010తో పోలిస్తే ఇది 72 శాతం ఎక్కువ. వలస వచ్చినవారిపై ప్రభుత్వ చర్యను వాయిదావేసే డాచా కార్యక్రమాన్ని బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చింది. అది చట్టవిరుద్ధమని జడ్జి హ్యానన్ తేల్చారు.






