అమెరికా మాజీ ఉపాధ్యక్షుడి నివాసంలో ఎఫ్బీఐ సోదాలు
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్ పెన్స్ నివాసంలో ఎఫ్బీఐ సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. రహస్యపత్రాల కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఇండియానాలోని ఆయన నివాసంలో ఈ తనిఖీలు జరిగాయి. అటార్నీలు క్లాసిఫైడ్గా వర్గీకరించిన కొన్ని పత్రాలను ఎఫ్బీఐ నెల క్రితం గుర్తించడంతో ఈ దర్యాప్తు మొదలయింది. ట్రంపు హయాం చివర్లో కొన్ని దస్త్రాలు ఉన్న పెట్టెలు ఇండియాలోని పెన్స్ నివాసానికి ప్రమాదవశాత్తు వచ్చేశాయని ఆయన తరుపు న్యాయవాది ఇప్పటికే ఎఫ్బీఐకి వెల్లడించారు.






