అమెరికా విదేశాంగ మంత్రితో జై శంకర్ చర్చలు
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ అయ్యారు. కంబోడియాలో జరుగుతున్న ఆసియాన్-ఇండియా సదస్సు సందర్భంగా వీరి భేటీ చోటు చేసుకొంది. భారత్ తరపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నేతృత్వంలోని దౌత్య బృందం ఈ సదస్సులో పాల్గొంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో మంచి భేటీ జరిగింది. ఉక్రెయిన్, ఇండో`పసిఫిక్, ఇంధనం, జి-20, ద్వైపాక్షిక అంశాలపై చర్చించాం అని జైశంకర్ తెలిపారు. జి-20 సదస్సులో బైడెన్-మోదీ భేటీ కానున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.






