Elon Musk : క్యాబినెట్ సమావేశంలో మస్క్ టాప్ సీక్రెట్ నోట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధ్యక్షతన ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. డోజ్ (Doze) సారథిగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk) తన టేబుల్‌పై రాసిన ఒక నోట్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దానిపై టాప్ సీక్రెట్ (Top secret) ( అత్యంత రహస్యం) అని రాసి ఉంచారు. వీడియోను గందరగోళానికి గురిచేయాలనే ఉద్దేశంతోనే మస్క్ ఇలా చేసి ఉంటారని ఒకరు చేసిన వ్యాఖ్యకు మస్క్ స్పందిస్తూ ..నవ్వుతు ఉన్న ఎమోజీని పంచుకున్నారు.