J.D. Vance :భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు ఆయనే

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance ) ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు ఏశారు. భవిష్యత్తులో అగ్ర రాజ్యానికి ఆయనే అధ్యక్షుడు (President) అవుతారని అంచనా వేశారు. దేశానికి మంచి నాయకుడిగా ఉంటారంటూ మస్క్ కొనియాడారు. అమెరికా ఉపాధ్యక్షుడి (Vice President) హోదాలో ఉన్న జేడీ వాన్స్ అత్యుత్తమంగా పని చేస్తున్నారు. ఆయన దేశానికి కాబోయే అధ్యక్షుడు అని మస్క్ అన్నారు.