ట్రంప్ కి రెండవ అభిశంసన
క్యాపిటోల్ భవనంపై దాడిలో ట్రంప్ పాత్రకు నిరసనగా డెమోక్రాట్లు, కొందరు రిపబ్లికన్లలో గత వారాంతంలో ఆగ్రహావేశాలు పెరిగిపోయాయి. ఆ కారణంగా ట్రంప్‌పై రెండవ అభిశంసన చేపట్టాలనే అభిప్రాయం ఊపందుకుంటోంది.
తాను, మరికొందరు డెమోక్రాట్లు కలిసి రూపొందించిన అభిశంసన తీర్మానానికి 190 కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు లభించిందని, దానిని నేడు ప్రతినిధుల మహాసభలో ప్రవేశపెట్టడం జరుగుతుందని కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రాట్ టెడ్ లయూ ప్రకటించారు.
క్యాపిటోల్ మీద దాడికి అల్లరి మూకలను రెచ్చగొట్టినట్టు ట్రంప్‌పై వచ్చిన ఆరోపణకు సంబంధించిన ఈ తీర్మానం మంగళవారం నాడు ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అయితే, జో బైడన్ అధ్యక్ష పదవి చేపట్టగానే సెనేట్ విచారణ ప్రారంభం కావడమెందుకని కొందరు ఉన్నతస్థాయి డెమోక్రాట్లు భావిస్తున్నారు. అందువల్ల ఈ తీర్మానాన్ని సెనేట్‌కు పంపించడానికి ప్రతినిధుల మహాసభ ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఫలితంగా విచారణ వాయిదా పడవచ్చు.
అరెస్టులు
రైఫిల్‌తో ఉన్నందుకు ఒక వ్యక్తిపై అభియోగం దాఖలు చేశారు. ప్రతినిధుల మహాసభ స్పీకర్ నాన్సీ పెలోసీని బెదిరించినట్లు అతనిపై ఆరోపణ వచ్చింది. లైవ్ టీవీ కార్యక్రమంలో ఆమె తలలో తూటా ప్రవేశపెడతానంటూ అతను ఒక మెసేజ్ ద్వారా బెదిరించినట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా, క్యాపిటోల్ భవనంపై దాడిచేసిన వారిలో చాలామందిని అరెస్టు చేయడం జరిగింది. కారులో పేలుడు సీసాలున్న ఒక సాయుధ అలబామా వ్యక్తి, ఒక వెస్ట్ వర్జీనియా శాసనకర్త కూడా అందులో ఉన్నారు. వారు అక్రమంగా క్యాపిటోల్లో ప్రవేశించినట్టు ఆరోపణ చేశారు.






