అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా ట్రంప్ పుస్తకం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసిన సేవ్ అమెరికా పుస్తకం విడుదలైన కొద్ది గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. పుస్తకం ధర 92.06 డాలర్లు(రూ.7,732) ఉన్నప్పటీ అధ్యక్షులు, దేశాధినేతల జీవిత చరిత్రలు విభాగంలో అమ్మకాల్లో తొలిస్థానంలో నిలిచింది. మొత్తంగా చూస్తే 13వ స్థానంలో ఉంది. ట్రంప్ ఈ పుస్తకాన్ని మంగళవారం విడుదల చేశారు. అమెరికా దేశ భక్తులంతా ఈ పుస్తకాన్ని కచ్చితంగా చదవాలన్నారు. తాను అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి ప్రస్తుత ఎన్నికల ప్రచారం వరకు తన జీవిత విశేషాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను పుస్తకంలో పొందుపర్చినట్లు తెలిపారు. జూలైలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ట్రంప్‌పై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన అదే వేదికపై నిలబడి పిడికిలి బిగించి, పోరాడతా అంటూ నినదిస్తున్న ఫొటోను పుస్తకం కవర్ పోటోగా పెట్టారు.






