రానున్న నాలుగేళ్లు అమెరికాకు.. స్వర్ణయుగం
రానున్న నాలుగేళ్లు అమెరికా చరిత్ర లోనే స్వర్ణయుగంగా నిలిచిపోనున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ నామినేషన్‌ను అంగీకరిస్తూ ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఘనవిజయాన్ని సాధిస్తున్నట్లు చెప్పారు. దేశంలో సగానికి కాదు, అమెరికా మొత్తానికి అధ్యక్షుడిగా పోలీచేస్తున్నా. సగం అమెరికాను గెలుచుకోవడంలో విజయం లేదు అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అద్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాకు చెందిన 10 మంది చెత్త అధ్యక్షులను తీసుకోండి. బైడెన్ చేసినంత నష్టాన్ని ఆ పది మంది కలిపి కూడా చేసుండరు అని విమర్శించారు.
.






