Donald Trump: ట్రంప్ ప్రమాణం నేడే

అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald trump) సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలు) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా(Florida) నుంచి వాషింగ్టన్(Washington)కు సైనిక విమానంలో చేరుకున్నారు. ఈసారి ప్రపంచదేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. రొనాల్డ్ రీగన్ (Ronald Reagan) 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది.