ఫ్లోరిడాలో సేవ్ అమెరికా ర్యాలీ…

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 3న ఫ్లోరిడాలో సేవ్ అమెరికా పేరుతో ర్యాలీ తీయనున్నారు. సరసోటాలో ర్యాలీని నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాత్రి 8 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని, అర్ధరాత్రి భారీ బాణాసంచ ప్రదర్శనతో ర్యాలీ ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు ఓహియోలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఫ్లోరిడా స్పాన్సర్ చేస్తుందని పేర్కొంది.