Harvard University: హార్వర్డ్ వర్సిటీకి డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University )పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కత్తిగట్టారు. వర్సిటీకి పన్ను మినహాయింపు హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే వాళ్లకు తగిన శాస్త్రి అంటూ ట్రంప్ పేర్కొన్నారు. హోదా రద్దుకు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆర్థిక శాఖ (Finance Department) ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి (Student 0ఆందోళనలకు కట్టుడి సహా పలు అంశాల్లో తన ఆదేశాలను ఖాతరు చేయనందుకు హార్వర్డ్‌పై కొంతకాలంగా ఆయన గుర్రుగా ఉండటం తెలిసిందే. వర్సిటీకి దాదాపు 300 కోట్ల డాలర్ల మేరకు ప్రభుత్వ నిధులను నిలిపేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయినా స్వేచ్ఛ, స్వతంత్ర ప్రతిపత్తి విషయాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని హార్వర్డ్ ఇప్పటికే కుండబద్దలు కొట్టింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ పన్ను మినహాయింపు హోదా రద్దు ప్రకటన చేశారు.