Supreme Court: జన్మత పౌరసత్వంపై సుప్రీంకోర్టుకు ట్రంప్

అమెరికాలో జన్మత లభించే పౌరసత్వాన్ని (Citizenship) రద్దు చేసి తీరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )పట్టుదలగా ఉన్నారు. తాజాగా తన ఆదేశాలను ఫెడరల్ కోర్టులు నిలిపివేయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు (Supreme Court ) ను ఆశ్రయించారు. తాత్కాలిక సొలిసిటర్ జనరల్ సారా హారిస్ (Sarah Harris) ఈ పిటిషన్ సాధారణమైనదని అభివర్ణించారు. మూడు దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ట్రంప్ జారీ చేసిన ఈ కార్యనిర్వాహక ఆదేశాలు తీవ్రమైన న్యాయ చిక్కులను ఎదుర్కొంటున్నాయి. మేరీల్యాండ్, మసాచుసెట్స్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజంక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి.