వారిద్దరి మధ్య చర్చలు .. అలాగే ఉంటాయి : ట్రంప్
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో భాగంగా ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ మాట్లాడుతూ ఒకవేళ కమలా హారిస్ విజయం సాధిస్తే ఆమె చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపాల్సి ఉంటుంది. అప్పుడు ఆమెతో జిన్‌పింగ్ ఎలా వ్యవహరిస్తారు? అని ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి మాజీ అధ్యక్షుడు బదులిస్తూ ఓ చిన్న పిల్ల మాదిరిగా ఆమెను చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఆమెను చిన్న పిల్లను చేసి చాక్లెట్లను లాగేసినట్లు మనదంతా దోచుకుంటారు. ఏం జరుగుతుందో కూడా ఆమెకు అర్థం కాదు. చెస్‌ను అప్పుడే మొదలు పెట్టిన ఆటగాడితో గ్రాండ్ మాస్టర్ ఆడితే ఎలా ఉంటుందో వారిద్దరి ( కమలా హారిస్`జిన్‌పింగ్) చర్చలు కూడా అలాగే ఉంటాయి అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. ఆమెకు మరో నాలుగేళ్లు అధికారిమిస్తే ప్రజల జేబులిన్నీ ఖాళీ చేస్తారంటూ దుయ్యబట్టారు.






