Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు అరుదైన పురస్కారం
అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) అరుదైన పురస్కారం అందుకున్నారు. మీడియా సంస్థ ఫాక్స్ నేషన్ లాంగ్ ఐలాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిని పేట్రియాట్ ఆఫ్ ఇది ఇయర్ అవార్డు (Patriot of the Year award) తో సత్కరించింది. ఈ అవార్డును సాధారణంగా సైనికులు, దేశానికి సేవ చేసే వాళ్లకు ప్రకటిస్తారు. ఈ ఏడాది ట్రంప్‌నకు అందజేశారు. అనంతరం ట్రంప్ (Trump) మాట్లాడుతూ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నాలుగేళ్ల కాలంలో చేయలేనివి, గత రెండు వారాల్లోనే చేయగలిగానని, వాటి ఫలితాలను మెరికాన్లు చవిచూస్తున్నారని తెలిపారు.






