Russia: నిర్ణయం ఇక రష్యా చేతిలోనే!

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమన ప్రతిపాదనకు పుతిన్ అంగీకరిస్తారనే భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆశాభవం వ్యక్తం చేశారు. రష్యా (Russia) అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయమవుతుందని అభిప్రాయపడ్డారు. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా (Saudi Arabia) లోని జెడ్డాలో అమెరికా(America), ఉక్రెయిన్ ( Ukraine ) మధ్య జరిగిన చర్చల్లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. ఆ వెంటనే ట్రంప్ స్పందించారు. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. ఇప్పుడు మేం రష్యా వద్దకు వెళ్తాం. పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. అంగీకరించకపోతే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది అని పేర్కొన్నారు.