రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో నవంబరులో జరగబోయే ఎన్నికకు పార్టీ తరపున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది. ఎంతో ఆలోచించి, అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వ్యాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నారు. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందించారు.






