ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ అద్భుతమైన ఇద్దరు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నింబధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. సేవ్ అమెరికా`2 ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి. వీరిద్దరూ నా పాలనకు మార్గం సుగమం చేస్తారు అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.






