డొనాల్డ్ ట్రంప్ కొత్త పార్టీ!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన ఓటమిని అంగీకరించని ట్రంప్.. నూతనాధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆయన సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారని సమాచారం. పేట్రియాటిక్ అనే పేరుతో పార్టీ ఏర్పాటు చేసి.. మద్దతుదారులను కూడగట్టాలన్న యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో తనపై ప్రతికూలత నెలకొన్న నేపథ్యంలో కాస్తా పరిస్థితులు చక్కదిద్దుకున్నాక.. పార్టీ పేరును ప్రకటించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిసింది.






