కీలక రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ
కీలక రాష్ట్రాల్లో ఓటింగ్‌పై కోర్టుకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్‌కు జార్జియాలో ఇప్పటికే వ్యతిరేక తీర్పు రాగా, తాజాగా మిచిగాన్‌లోనూ ఎదురుదెబ్బ తగిలింది. జార్జియాలో జడ్జి ఏకవాక్యంతో ట్రంప్ వ్యాజ్యాన్ని కొట్టేయగా.. మిచిగాన్‌లోనూ ట్రంప్ వేసిన కేసును కోర్టు కొట్టేసింది. తమ పరిశీలకులను లెక్కింపు కేంద్రాల్లోకి తగిన విధంగా అనుమతించట్లేదని, ఆయా కేంద్రాల్లోని వీడియో పుటేజీని తమకు ఇవ్వాలని కోరుతూ ట్రంప్ కొర్టుకు వెళ్లారు. అయితే అలా ఇవ్వడం న్యాయపరంగా కుదరని, డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ ప్రకారం పరిశీలకులకు తగిన అనుమతులు ఇచ్చారని, అసలు లెక్కింపే ముగిసినందున ట్రంప్ అభ్యర్థనను స్వీకరించలేమని న్యాయమూర్తి తెల్చి చెప్పాడు.






