Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స ట్రంప్ చేత ప్రమాణం చేయించారు. కాగా, అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, జేడీ వాన్స్ కూడా అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, వాషింగ్టన్లో తీవ్ర చలి కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవనంలో నిర్వహించారు. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వేడుక వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆయన ప్రమాణ స్వీకారానికి దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. నేటి నుంచి అమెరికాలో స్వర్ణయుగం ప్రారంభం కానుందన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తాం అని అన్నారు ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూఎస్ క్యాపిటల్పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు.