ఆయన చర్యల కారణంగా భవిష్యత్తులో .. మూడో ప్రపంచ యుద్ధం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్‌కు మతి భ్రమించిందని, ఆయన చర్యల కారణంగా భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం సంభవించినా ఆశ్చర్యంలేదంటూ వ్యాఖ్యానించారు. దేశానికి రక్షణ కవచంలా ఉండే సరిహద్దుల విషయంలో బైడెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరిహద్దుల వద్ద ఎలాంటి రక్షణ గోడ లేకపోవడం వల్ల దేశంలో ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. ఆయుధాల సమీకరణలో బైడెన్ చర్యలు దేశ భవిష్యత్తుకు హాని కలిగిస్తాయి. బైడెన్ మానసిక పరిస్థితి ద్వారా విపత్తు సంభవించవచ్చు అంటూ విమర్శలు గుప్పించారు.






