వేలానికి డొనాల్డ్ ట్రంప్ ఇల్లు… వారికి బంపర్ ఆఫర్
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చిన్ననాటి గృహం మరోసారి వేలానికి వచ్చింది. సుమారు రూ.22 కోట్లు విలువ చేసే ఈ హౌస్‌ను క్రౌడ్ ఫండింగ్ ద్వారా అభిమానులు కొనాలని రియల్ ఎస్టేట్ ఏజెన్సీ కోరింది. GoFundMe అనే క్రౌడ్ ఫండింగ్ సైట్ లో ఓ ఫండ్ రైజర్ ను ప్రారంభించింది. అభిమానులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ హౌస్‌ను కొనుగోలు చేస్తే, ట్రంప్ కు బహుమతిగా ఇస్తామని రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పారామౌంట్ రియాల్టీ తెలిపింది. ఈ ఇంట్లో డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల వయసు వరకు ఉన్నారు. మరి ట్రంప్ ఫ్యాన్స్ ముందుకు వస్తారా? లేదా? వేచి చూడాలి.






