Donald Trump: మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొన్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టెస్లా కారు(Tesla car) కొనుగోలు చేశారు. అధ్యక్షుడి కోసం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఏకంగా 5 కార్లను వైట్‌హౌస్ (White House) కు తీసుకురావడం విశేషం. వీటి ఫీచర్లను తానే దగ్గరుండి వివరించారు. అందులో నుంచి ఎరుపురంగు కారును ట్రంప్ ఎంపిక చేసుకున్నారు. డ్రైవింగ్ సీట్లో అధ్యక్షుడు కూర్చోగా, ఆ పక్కనే ఉన్న మస్క్ ఇది వేగంగా వెళ్లే కారు. సీక్రెట్ సర్వీసు (Secret Service ) కు ఓసారి షాక్ ఇద్దామా? అని సరదాగా జోక్ చేశారు. అయితే వాహనాన్ని నడిపేందుకు ట్రంప్‌నకు అనమతి లేనందున ఆయన టెస్ట్ డ్రైవింగుకు వెళ్లలేదు. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ కారును నేనే పూర్తి ధర అయిన 80 వేల డాలర్లకు (రూ.69.75 లక్షలు) కొనుగోలు చేశాను. మస్క్ నాకు దీనిపై డిస్కౌంటు ఇచ్చేవారే. కానీ, నేను రాయితీ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందానని వాళ్లు ( ప్రతిపక్షాలు ) విమర్శలు చేస్తారు. కాబట్టి మీడియా ఎదుటే కొనుగోలు చేశాను అన్నారు.