Vivek Ramaswamy : వివేక్ రామస్వామికి మద్దతు ప్రకటించిన ట్రంప్, మస్క్

భారత సంతతికి చెందిన అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఒహాయో గవర్నర్ అభ్యర్థిత్వానికి వేగంగా మద్దతు సమకూరుతోంది. తాజాగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), డోజ్ సారథి ఎలాన్ మస్క్ (Elon Musk) లు అతనికి అండగా నిలిచారు. రామస్వామి ఒహాయోను కచ్చితంగా ఉన్నతస్థానంలో ఉంచుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రంప్ స్పందిస్తూ.. గొప్ప రాష్ట్రమైన ఒహాయో గవర్నర్ (Governor of Ohio) పదవికి వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు. అతడు నాకు బాగా తెలుసు. ప్రత్యర్థిగా ఉన్నాను కూడా. రామస్వామిలో ఏదో ప్రత్యేకత ఉంది. కుర్రాడు, తెలివైనవాడు. మన దేశాన్ని నిజంగా ప్రేమించే చాలా మంచి వ్యక్తి వివేక్. అతడు ఒహాయోకు గొప్ప గవర్నర్ అవుతాడు. రాష్ట్రాన్ని ఎప్పుడూ వెనకపడనీయడు. నా సంపూర్ణ మద్దతు అతడికి ఉంది అని పేర్కొన్నారు. ఎలాన్ మాస్క్ కూడా రామస్వామికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గుడ్‌లక్, నీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని పేర్కొన్నాడు. దీనికి వివేక్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.