పోటాపోటీకి సంకేతం తొలి ఫలితం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్, డెమోక్రటిక్ అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొందని సర్వేలన్నీ తేల్చి చెప్పాయి. దానికి తగ్గట్లుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఫలితాలు వస్తున్నాయి. ఓటింగ్‌లో అతి చిన్న పోలింగ్ కేంద్రమైన డిక్స్‌విల్లే నాచ్‌లో ఫలితం టై అయింది. ఇక్కడ పోలైన 6 ఓట్లలో చెరి మూడు వచ్చాయి. 2020 ఎన్నికల్లో ఇక్కడ బైడెన్ ఆధిక్యం సాధించారు. న్యూహాంప్‌షైర్‌లోని అతి చిన్న రిసార్టు టౌన్ డిక్స్‌విల్లే నాచ్‌లో ఆరుగురు ఓటర్లున్నారు. 1960 నుంచీ వీరు పోలింగ్ రోజుకు ముందురోజు రాత్రే ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటింగ్ పూర్తయ్యాక 15 నిమిషాల అనంతరం ఓట్లను లెక్కిస్తారు.






