డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు సెనేట్ అంగీకారం
క్యాపిటల్ హిల్‌పై దాడికి బాధ్యుడిని చేస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సెనేట్‌లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం మీద విచారణ ప్రారంభమైంది. పదవి నుంచి దిగిపోయిన అధ్యక్షుడిపై సెనేట్‌లో విచారణ జరుపడం రాజ్యాంగబద్ధం కాదంటూ రిపబ్లికన్లు చేసిన వాదన వీగిపోయింది. అభిశంసన తీర్మానంపై ముందుకెళ్లడంపై ఓటింగ్ నిర్వహించగా, 56-44 ఓట్లతో తీర్మానం నెగ్గింది. ఆరుగురు రిపబ్లికన్లు కూడా దీనికి మద్దతు పలుకడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై సెనేట్‌లో నేడు విచారణ ప్రారంభం కానున్నది. సెనేట్‌లో రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు చెరి 50 మంది సభ్యులు ఉన్నారు. ట్రంప్‌ను దోషిగా తేల్చాలంటే 67 ఓట్లు అవసరం. అంటే తీర్మానానికి మద్దతిచ్చిన ఆరుగురితోపాటు మరో 11 మంది రిపబ్లికన్ల మద్దతు డెమోక్రాట్లకు అవసరం.






