Elon Musk :నన్ను చంపాలనుకుంటున్నారు .. మస్క్ సంచలన ఆరోపణలు

తనను చంపాలని డెమోక్రాట్లు కోరుకుంటున్నారని ప్రపంచ కుబేరుడు, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన ఆరోపణలు చేశారు. డోజ్(Doze) సంస్కరణలు వారికి రుచించడం లేదని పేర్కొన్నారు. అమెరికా (America)లో పన్ను చెల్లింపుదారుల ధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని మస్క్ బయట పెడుతున్నారంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. డెమోక్రాట్లకు ఇది బాగా అర్థమవుతుంది. మీ డబ్బు తీసుకోవడం కోసం మస్క్ రాలేదు. మీ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారి చిట్టాను బయటకు తీసుకొస్తున్నారు అని ఆ యూజర్ రాసుకొచ్చారు. దీనికి మస్క్ బదులిచ్చారు. అలా చేస్తున్నందుకే డెమోక్రాట్లు (Democrats) నన్ను చంపాలని చూస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఎంత పెద్ద విషయమో మీరే అర్థం చేసుకోవచ్చు అని సమాధానం ఇచ్చారు.