డొనాల్డ్ ట్రంప్‌ను దించుతావా లేదా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన పదవీకాలం ముగిసే లోపే ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దించాలని భావిస్తున్న డెమొక్రాట్లు.. ఇప్పుడు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు డెడ్‌లైన్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో తీర్మానం చేయనున్నారు. 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని పెన్స్‌పై ఒత్తిడి తెస్తున్నారు డెమొక్రాట్లు. ఈ సవరణ ద్వారా అధ్యక్షుడు తన విధులను సరిగా నిర్వర్తించడం లేదంటూ వైస్ ప్రెసిడెంట్, మెజార్టీ కేబినెట్ సభ్యులు అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఒకవేళ 24 గంటల్లో పెన్స్ ఈ పని చేయకపోతే. సభలో ట్రంప్‌పై అభిశంసన ప్రవేశపెట్టాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు. తన మద్దతుదారులను రెచ్చగొట్టి క్యాపిటల్ హిల్‌పై దాడికి ఊసిగొల్పారన్న అభియోగాలు ట్రంప్‌పై మోపడానికి సిద్ధమవుతున్నారు.






