డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేయాలి… లేదంటే
డొనాల్డ్ ట్రంప్ తనకు తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని స్పీకర్ నాన్సీ పెలోసీ డిమాండ్ చేశారు. లేదంటే అభిశంసన పక్రియ మొదలుపెడతామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ మేరకు ప్రతినిధుల సభ కార్యకలాపాల నిర్వహణ అధికారులకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని తెలిపినట్లు పేర్కొన్నారు. 25వ సవరణనూ పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో కొనసాగడం అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. కేపిటల్ భవన్పై దాడికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తప్పుకోవాలని లేకపోతే తామే తప్పించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా చరిత్రలో అత్యంత వైఫల్యమైన అధ్యక్షుడిగా వర్ణిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.






