డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు రంగం సిద్ధం
అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అభిశంసన తీర్మానానికి ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు తెలుపుతుండడం గమనార్హం. అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు ముట్టడించడాన్ని ఆయన ప్రోత్సహించారని పేర్కొంటూ దిగువ సభలో డెమోక్రాటిక్ పార్టీ సభా నాయకుడు డేవిడ్ సిసిలీన్ అభిశంసన తీర్మానాన్ని రాశారు. దీనికి 185 మంది మద్దతు తెలిపారు. దీనిపై బుధవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం సెనేట్‌కు పంపిస్తారు.






