సెనెటర్లుగా ఎన్నికైన ట్రాన్స్ జెండర్లు
అమెరికాలోని డెలావర్, వెర్మోంట్ల్లో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు సెనెటర్లుగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. 30 ఏళ్ల సారా మైక్బ్రైడ్ డెలావర్ మొదటి టాన్స్ సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 86 శాతం ఓట్లు సాధించారు. సాధారణ ఎన్నికల్లో గెలించామని, ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. వెర్మోంట్లో నార్త్‌లో 26 ఏళ్ల టేలర్ స్మాల్ రాష్ట్రానికి మొదటి లింగమార్పిడి ప్రతినిధిగా గెలుపొందింది. రెండు జిల్లాలలో ఆమె 43, 41 శాతం చొప్పున ఓట్లు సాధించి, దేశంలో ఐదో ట్రాన్స్ సెనేటర్‌గా నిలిచింది.
యూఎస్‌లో డెమొక్రాట్ డానికా రోమ్ మొట్టమొదటిగా చట్టసభ సభ్యుడిగా 2017లో వర్జీనియా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018లో వెర్మోంట్ డెమొక్రాట్ క్రిస్టిన్ హాల్క్విస్ట్ యునైటెడ్ స్టేట్స్లో ఒక ప్రధాన పార్టీ గవర్నర్ కోసం నామినేట్ చేసిన మొదటి లింగమార్పిడి వ్యక్తి అయ్యారు. రాజకీయ కార్యాచరణ కమిటీ విక్టరీ ఫండ్ సెనేటర్‌గా గెలిచిన టేలర్స్మాల్, సారా మైక్బ్రైడ్ను అభినందించింది. చరిత్ర సృష్టించారని కొనియాడింది. నిష్పాక్షికత, సమానత్వం కోసం నిలబడే అభ్యర్థులకు మద్దతిస్తున్నారని, పక్షపాత రాజకీయాలను తిరస్కరిస్తున్నారడానికి ఉదాహారణ అని పేర్కొంది.






