డొనాల్డ్ గురించి సత్యాలు చెబుతూనే ఉంటా : బైడెన్
డొనాల్డ్ ట్రంప్ గురించి వాస్తవాలు చెప్పే ప్రయత్నాన్ని తాను విరమించుకునేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తేల్చిచెప్పారు. లాస్‌వెగాస్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయ ఉద్రిక్తత ఒకింత చల్బడినట్లు కనిపించిందంటే దానర్థం, నిజాలు మాట్లాడడాన్ని ఆపేడయం కాదని అన్నారు. ఏఆర్ తరహా తుపాకులను నిషేధించడం సహా అన్ని రకాల రక్తపాతాలను అడ్డుకోవాల్సి ఉందని చెప్పారు. అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి వైదొలగాలని పార్టీ నుంచి వస్తున్న డిమాండ్లను తోసిపుచ్చారు. రెండోసారి అధికారంలోకి వస్తే మొదటి 100 రోజుల్లోగానే ఓటింగ్ హక్కులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బైడెన్ అభ్యర్థిత్వంపై ఆగస్టు మొదటి వారంలో డెమోక్రాట్లు నిర్ణయం తీసుకోనున్నారు. పోటీ నుంచి ఆయన వైదొలగాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.






