చైనా అసత్య ప్రచారం : అమెరికా
తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన చైనా చర్యను ఖండిస్తూ అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నిఘా వ్యవస్థ గురించి అబద్దాలను ప్రచారం చేస్తూ అంతర్జాతీయ సమాజాన్ని ఆ దేశం మోసం చేస్తున్నట్లు తీర్మానం పేర్కొంది. తీర్మానాన్ని పూర్తి రాజకీయ ప్రేరేపిత చర్యగా చైనా అభివర్ణించింది. ఘటనను బాగా పెంచి చూపిస్తున్నారని పునరుద్ఘాటించింది. ఈ అంశంలో చైనాను ఎదుర్కొనేందుకు క్వాడ్ సహా ఇతర దేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులను అమెరికా వేగవంతం చేసింది. కూల్చివేసిన బెలూన్ శిథిలాలను సముద్రం నుంచి సేకరించిన ఎఫ్బీఐ పరిశోధనల నిమిత్తం వాటిని వర్జీనియాలోని క్వాంటికో పరిశోధనా కేంద్రానికి తరలించింది.






