అమెరికా వైఖరిని ఖండించిన చైనా, రష్యా
ప్రజాస్వామ్య సదస్సుకు హాజరు కావాలంటూ తైవాన్ను అమెరికా ఆహ్వానించడంపై అమెరికాలోని చైనా, రష్యా రాయబారులు సంయుక్తంగా తీవ్రంగా ఖండించారు. అమెరికా ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వం నుంచచి పుట్టుకు వచ్చినదే ఈ ఆలోచన అని వారు పేర్కొన్నారు. ఈ మనస్తత్వం కారణంగానే కొత్తగా తలెత్తుతున్నాయన్నారు. ఇది ప్రపంచంలో చీలికకు దారి తీస్తుందన్నారు. ఇటువైపు చైనా తనదైన సొంత పంథాను అనుసరిస్తుండగా, అటువైపు అమెరికా నేతృత్వంలోని రంగుల విప్లవాల నుంచి నెమ్మదిగా పూర్వపు సోవియట్ రిపబ్లికన్లు కోలుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి సైద్దాంతిక సంబంధమైన ఘర్షణలు ఎంత బాధాకరమో ప్రజలకు తెలియజేయడానికి చైనా, రష్యా సంయుక్తంగా సందేశాన్ని పంపాయని నిపుణులు వ్యాఖ్యానించారు.






