అగ్రరాజ్యంలో తగ్గుతున్న శ్వేతజాతీయులు
అగ్రరాజ్యం అమెరికాలో శ్వేతజాతీయుల జనాభా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చరిత్రలో తొలిసారిగా వీరి సంఖ్య 60 శాతానికి కంటే దిగువకు చేరడం గమనార్హం. 2010 జూలైలో అగ్రరాజ్యంలోని మొత్తం జనాభాలో శ్వేతజాతీయుల వాటా 63.8 శాతం ఉండగా, 2020 జూలై నాటికి ఈ సంఖ్య 59.7 శాతానికి దిగొచ్చింది. ఈ కాలంలో దాదాప పది లక్షల శ్వేతజాతీయుల జనాభా తగ్గినట్టు సమాచారం. లేటు వయసులో పెండ్లి, పరిమిత సంతానం. శ్వేతజాతీయుల జనాభా తగ్గడానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అమెరికాలో మైనారిటీ గ్రూపులైన లాటినో అమెరికన్లు, ఆసియా-అమెరికన్లు, ఆఫ్రికా-అమెరికన్ల జనాభాలో పెరుగుదల నమోదవుతున్నది.






