అధ్యక్షుడి బైడెన్ పై ట్రంప్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆయన ఫిట్నెస్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిమిత్తం పార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ట్రంప్ ఈ విమర్శలు చేశారు. బైడెన్ పలు సందర్భాల్లో మెట్లు ఎక్కుతూ అదుపుతప్పి పడిపోయారు. ఒక దేశం పేరు బదులు మరో దేశం పేరు ప్రస్తావించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో దఫా అధ్యక్ష స్థానం కోసం పోటీ పడేందుకు బైడెన్ సిద్ధమవుతున్న వేళ వీటిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఆయన మెట్ల దారిని సరిగా గుర్తించలేరు. వేదికపైకి రాలేరు. ఈ వేదిక చూడండి ఎంత చెత్తగా ఉందో. కానీ కుడి, ఎడమ ఎటువైపు వైళ్లినా నాకు మెట్లు కనిపిస్తాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం లేచి నిలబడి, నేను ఎక్కడున్నా అంటారు అని తన పార్టీ కార్యక్రర్తలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు.






