క్వాడ్ తరహాలో ఆకుస్ కూటమి : జో బైడెన్
ఆస్ట్రేలియాకు సబ్మెరైన్స్ విక్రయించేందుకు ఆ దేశంతో అమెరికా, బ్రిటన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇండో`పసిఫిక్ వ్యూహంలో భాగంగా ఈ మూడు దేశాలు కలసి ఆకుస్ కూటమిని ఏర్పాటు చేశాయి. బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్లతో కలిసి బైడెన్ వీడియో సమావేశంలో కొత్త కూటమిని ప్రకటించారు. ఆస్ట్రేలియా కోసం అణు జలాంతర్గాములను అభివృద్ధి పరచడంపై ఇక తమ దృష్టి కేంద్రీకరించనున్నట్లు ముగ్గురు నేతలు తెలిపారు. దీర్ఘకాలంలో, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొల్పాల్సిన అవసరం ఉందని బైడెన్ తెలిపారు. కొత్తగా భద్రతా కూటమిని ఏర్పాటు చేయడమంటే కవ్వింపు చర్యగానే బీజింగ్ పరిగణించే అవకాశం ఉంది.






