Telita Crossland: యూఎస్ మిలిటరీ హెల్త్ ఏజెన్సీ అధిపతి రాజీనామా

వైవిధ్యం, సమానత్వం, ఏకీకరణ (డీఈఐ) విధానాలను పక్కనపెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) కార్యవర్గం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం లెప్టినెంట్ జనరల్ (Lieutenant General), సైనిక ఆరోగ్య సంస్థ అధిపతి అయిన టెలిటా క్రాస్లాండ్ (Telita Crossland) రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. క్రాస్లాండ్ 32 ఏళ్ల పాటు దేశానికి, సైనిక ఆరోగ్య వ్యవస్థకు విశేష సేవలు అందించారని రక్షణ శాఖ సహాయ కార్యదర్శి (ఆరోగ్య వ్యవహారాల) స్టీఫెన్ ఫెరారా (Stephen Ferrara) అభినందించారు. ఆమె చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పదవీ కాలం పూర్తి కాకముందే ఆమె ఆకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారనే విషయం వెల్లడించలేదు.